రేవంత్ రెడ్డి ఈరోజు ఆరు గ్యారంటీల గురించి సమీక్ష చేస్తున్నాడట
రెండేళ్లలో ఎన్నడూ ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేయకుండా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందే సమీక్ష చేస్తున్నాడంటే ఓటమి భయంతోనే –మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు pic.twitter.com/ttRqCf88xr
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2025
కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాలని చూస్తోంది
ఫేక్ స్లిప్పులను ఎన్నికల అధికారికి సైతం పంపించాం
మాజీమంత్రి హరీష్‌రావు సంచలన ఆరోపణలు
కాకతీయ, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని చూస్తోందని మాజీమంత్రి హరీష్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఓటర్ ఐడీ కార్డులు పంపిణీ చేసి దొంగ ఓట్లు వేయాలని చూస్తోందని అన్నారు. వీడియో ఆధారాలు అన్ని ఎన్నికల ప్రధాన అధికారికి చూపించి, వారి ఫోన్ కి కూడా పంపించామని తెలిపారు. దొంగ ఓటరు ఐడీ కార్డులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటే ఎన్నికల అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారంటూ హరీష్‌రావు మండిపడ్డారు.


