- కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్సాంపల్లి సైదులు
కాకతీయ, నెల్లికుదురు : వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్సాంపల్లి సైదులు అన్నారు. మంగళవారం మండలం లోని మునిగలవీడు గ్రామంలో వ్యవసాయ కార్మికుల సమావేశం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ఇందిరమ్మ భరోసా పథకాన్ని ద్వారా వ్యవసాయ కార్మికులకు ప్రతినెల పెన్షన్ ఇస్తామన్న పన్నెండు వేలు చెల్లించాలన్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీలో మహిళల పేర్లను నమోదు చేసుకోవడమే సరిపోయిందని విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అధికారులు గ్రామంలో పర్యటించి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భూక్య బిక్షపతి, బండ వెంకన్న, శ్యామల మల్లయ్య, వెంకటయ్య, కిష్టయ్య, బీలు ఎల్లయ్య, బద్రు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


