లలితకు నివాళి అర్పించిన కాంగ్రెస్ నేతలు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం, కొంజర్ల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన దొబ్బల లలిత ఇటీవల మృతిచెందగా, ఆమె దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం ఖమ్మం ఖానాపురంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ పాల్గొని లలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు.


