పాలేరులో కాంగ్రెస్ జోరు
హస్తం గూటికి బీఆర్ఎస్ కుటుంబాలు
కాకతీయ,ఖమ్మం రూరల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పాలేరు నియోజకవర్గ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల నుంచి ఇరవై కుటుంబాలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో మంగళవారం చేరారు.
తీర్థాల నుంచి 10 కుటుంబాల చేరిక..
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన పది కుటుంబాలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నాయి. బోడా వెంకన్న ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. చేరిన వారిలో భూక్యా బాస్ నాయక్, భూక్యా మోతిలాల్, సీతల అనంతరాములు, సీతల వీరన్న, సీతల నాగరాజు, సీతల శంకర్, భూక్యా బాస్, తేజావత్ శివ, తేజావత్ సురేష్ తదితరులు ఉన్నారు. వీరికి ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు.
మంగళిబండ తండా నుంచి ఉపసర్పంచ్ సహా…
అదేవిధంగా కూసుమంచి మండలం మంగళితండా నుంచి కూడా బీఆర్‌ఎస్‌కు చెందిన ఉప సర్పంచ్ తేజావత్ బాలకృష్ణ సహా మరో పది కుటుంబాలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నారు. తేజావత్ సుబాస్, తేజావత్ నరేష్, బానోత్ శ్రీను, తేజావత్ శోభన్, తేజావత్ కృష్ణ, తేజావత్ గోపి, బానోతు సింహాద్రి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి కూడా క్యాంపు కార్యాలయంలో తుంబూరు దయాకర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తేజావత్ వెంకట్, తేజావత్ రాజు తదితరులు పాల్గొన్నారు.


