epaper
Saturday, November 15, 2025
epaper

కాంగ్రెస్‌కు బాకీ కార్డు ఎఫెక్ట్‌

కాంగ్రెస్‌కు బాకీ కార్డు ఎఫెక్ట్‌
స్థానిక ఎన్నిక‌లే ల‌క్ష్యంగా బీఆర్ ఎస్ రాజ‌కీయ అస్త్రం
కాంగ్రెస్ వైఫ‌ల్యాల‌పై ఇంటింటికి కార్డుల పంపిణీ
ప్ర‌భుత్వంపై జ‌నాగ్ర‌హం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌న్న ధీమాలో గులాబీ లీడ‌ర్లు
క్యాడ‌ర్‌లోనూ పెరిగిన జోష్‌… మాజీ ఎమ్మెల్యేలు సైతం ఆక్టివ్‌
త‌ప్పికొట్టాల‌ని కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం క్యాడ‌ర్‌కు పిలుపు
కౌంట‌ర్ అటాక్‌కు దూరంగానే కాంగ్రెస్ క్యాడ‌ర్‌..!
ఎమ్మెల్యేలూ సైతం ప‌ట్టించుకోక‌పోవ‌డంపై అధిష్ఠానం సీరియ‌స్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ బాకీ కార్డు నిర‌స‌నను బీఆర్ ఎస్ పార్టీ ఉదృతం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22నెలల పాలనలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇస్తామని చెప్పిన తులం బంగారం బాకీ పడ్డారని, వికలాంగుల పెన్షన్ నెలకు 6000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 22 నెలలకు 44 వేల రూపాయలు బాకీ పడ్డారని గ్రౌండ్‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల్లో అడ్డ‌గోలుగా హామీలిచ్చి.. న‌మ్మ‌బ‌లికి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తూ గ‌ద్దెనెక్కింద‌ని, అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు కావ‌స్తున్నా ఫ్రీ బ‌స్సు ఒక్క‌టి మిన‌హా ఏ ప‌థ‌కాన్ని పూర్తి స్థాయిలో అమ‌లు చేయ‌లేద‌ని పేర్కొంటూ బీఆర్ ఎస్ పార్టీ విమ‌ర్శిస్తూ వ‌స్తోంది. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తీ హామీని అమ‌లు చేసేంత వ‌ర‌కు తాము కాంగ్రెస్ పార్టీ వెంటాప‌డుతూనే ఉంటామ‌ని, ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తున్న రేవంత్ స‌ర్కారు భ‌ర‌తం ప‌ట్ట‌డ‌మే బీఆర్ ఎస్ ల‌క్ష్య‌మంటూ ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌లుమార్లు ఉద్ఘాటించారు. స్థానిక ఎన్నిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని బీఆర్ ఎస్ పార్టీ చేప‌డుతున్న ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి క్షేత్ర‌స్థాయిలో అనుహ్య రాజ‌కీయ స్పంద‌న క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ లీడ‌ర్లు ధీమాగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీల‌ను బాకీగా పేర్కొంటూ ఇంటింటికి వెళ్తూ.. కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డుల‌ను అంద‌జేస్తున్నారు.

 

గ‌ళం వినిపించ‌లేక‌పోతున్న కాంగ్రెస్‌..

రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజ‌యాల‌ను, అమలు చేస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని పార్టీ, ప్ర‌భుత్వ పెద్ద‌లు క్యాడ‌ర్‌కు సూచిస్తూ వ‌స్తున్నారు. మ‌న విజ‌యాలు మ‌నం చెప్పుకోకుంటే పార్టీకి తీవ్ర‌మైన న‌ష్టం జ‌రుగుతుంద‌ని చెబుతూ వ‌స్తున్నారు. ఉన్నంత‌లో రైతు రుణ‌మాఫీ ఒక‌టి, మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం, ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు కొంత బ‌లంగా క‌నిపిస్తున్నాయి. అయితే ఇటీవ‌ల యూరియా కొర‌త అంశం రైతాంగంలో పూర్తి వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకునేలా చేసింది. 2ల‌క్ష‌ల‌కు మించిన రుణం ఉన్న‌ రైతుల‌కు మాఫీ కాలేదు. ఆలోపు ఉన్న రైతుల‌కు ఉన్న కొంత‌మంది రైతుల‌కు కూడా మాఫీ కాలేదు. ఇక మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.4వేల అంద‌జేసే ప‌థ‌కం, పించన్ల 4వేల‌కు పెంపు, కొత్త పింఛ‌న్లు వంటి హామీల‌ను ప్ర‌భుత్వం పెండింగ్ పెడుతూ వ‌స్తోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల‌కు సంబంధించి కూడా అర‌కొర‌గా మంజూరీలే జ‌రిగాయ‌ని, అందులోనూ అన‌ర్హుల పాలే ఎక్కువగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు గ్రామీణ జ‌నం నుంచి ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఈనేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినాయ‌క‌త్వం చెబుతున్న విధంగా క్షేత్ర‌స్థాయిలో క్యాడ‌ర్ పార్టీ, ప్ర‌భుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై బ‌లంగా గ‌ళం వినిపించ‌లేక‌పోతోందన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల నుంచే వ్య‌క్త‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం.

ఇర‌కాటంలో అధికార పార్టీ..!
గులాబీ పార్టీ చేప‌ట్టిన కాంగ్రెస్ బాకీ కార్డు కార్య‌క్ర‌మానికి క్షేత్ర‌స్థాయిలో మంచి రాజ‌కీయ స్పంద‌న వ‌స్తుండ‌టంతో ఆపార్టీ క్యాడర్‌లో జోష్ క‌నిపిస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి ముందు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి అంటీ ముట్ట‌న‌ట్లుగా ఉంటూ వ‌స్తున్న మాజీ ఎమ్మెల్యేలు.. అనుచ‌రుల ఫీడ్ బ్యాక్‌తో మ‌ళ్లీ ఆక్టివ్ అయ్యారు. స్వ‌యంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుత‌న్న ఇంటింటికి బాకీ కార్డు పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొంటుండ‌టం గ‌మ‌నార్హం. పార్టీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు ప్ర‌ద‌ర్శ‌న‌, పంపిణీల్లో ముఖ్య నేత‌ల‌తో పాటు మండ‌లాల్లోని ద్వితీయ శ్రేణి క్యాడ‌ర్ విస్తృతంగా పాల్గొంటూ వ‌స్తోంది. స‌మీప భ‌విష్య‌త్‌లోనే స్థానిక ఎన్నిక‌లు ఉండ‌టం కూడా ఇందుకు కార‌ణ‌మ‌వ‌చ్చు కాని… బీఆర్ ఎస్ పార్టీ చేప‌ట్టిన బాకీ కార్డు నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జ‌ల నుంచి అనుహ్య స్పంద‌న ల‌భిస్తుంటం చేతి పార్టీలో మాత్రం క‌ల‌వ‌ర పాటుకు గురి చేస్తోంద‌నే చెప్పాలి. వాస్త‌వానికి చాలా సీరియ‌స్‌గా బీఆర్ ఎస్ నాయ‌క‌త్వం బాకీ కార్డు కార్య‌క్ర‌మాన్ని జ‌నంలోకి తీసుకెళ్తుండ‌గా.. బీఆర్ ఎస్ పార్టీ రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చేందుకు ఎమ్మెల్యేలుగానీ, వారి అనుచ‌ర వ‌ర్గంగాని స్టెప్ తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. బీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న ప్ర‌చారాల‌పై కౌంట‌ర్ ఇవ్వాల‌ని పార్టీ అధినాయ‌క‌త్వం నుంచి సూచ‌న‌లు… ఆదేశాలు అందినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నార‌న‌రి స‌మాచారం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img