పాలకుర్తి శాసన సభ్యురాలు యాశస్విని రెడ్డి
కాకతీయ, పెద్దవంగర : ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని పాలకుర్తి శాసన సభ్యురాలు యాశస్విని రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కన్వాయ్ గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో బొమ్మరబోయిన ప్రదీప్, మాజీ వార్డు సభ్యుడు భూక్య కృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు ఠాగూర్ ముత్యం, రవి ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలతో కలసి పని చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీయే అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల హక్కుల కోసం పోరాటంలో ముందు వరుసలో నిలుస్తుందన్నారు. మండల అభివృద్ధి కోసం అందరూ ఏకతాటిపై పనిచేయాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దవంగర మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ తదితరులు పాల్గొన్నారు.


