స్థానిక ఎన్నికల్లోకి కొత్తవేషంతో కాంగ్రెస్
ఆరు గ్యారంటీలు అమలుచేడంలో కాంగ్రెస్ విఫలం
బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ,ఆత్మకూరు : ఆరు గ్యారంటీలు అమలుచేడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మందపెల్లి ప్రసాద్,చౌళ్లపల్లి మాజీ ఎంపీటీసీ బొమ్మగాని భాగ్య రవి గౌడ్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు గ్యారంటీ లేదని ఎద్దేవా చేశారు.స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తవేశంతో ప్రజల్లోకి వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చే హామీలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకే దిక్కు లేదని ఇప్పుడు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నాయకులు తుంగలో తొక్కుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతి గ్రామంలోకి స్థానిక ఎమ్మెల్యే వెళ్తే అడుగడుగునా మహిళలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సమయం దగ్గర పడుతుందని జరగబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని అన్నారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు లేతాకుల సంజీవ రెడ్డి,పెంచికలపేట మాజీ సర్పంచ్ రమేష్, బీఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి మందపెల్లి మధుకర్, బీఆర్ఎస్ నాయకులు కేశవా రెడ్డి, రాజు, అగ్రంపహాడ్ బీఆర్ఎస్ నాయకులు మదాసి రాజు, చౌళ్లపల్లి బీఆర్ఎస్ నాయకులు మహేందర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


