తీగల తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం
కాకతీయ, జనగామ : జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని తీగల తండాలో సర్పంచ్ పదవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీగల సాంబరాజు యాదవ్ అన్ని 8 వార్డులతో కలిసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం పట్ల అధికారులు ప్రశంసలు తెలిపారు. ఈ నెల 3వ తేదీన సర్పంచ్ నియామక పత్రాన్ని అధికారులు అందజేయనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటించిన బంపర్ ప్యాకేజీ గ్రామంలో హర్షం నెలకొల్పింది. గ్రామ అభివృద్ధి కోసం 25 లక్షల ప్రత్యేక నిధులుతో పాటు అదనపు పథకాలను కూడా అమలు చేయనున్నట్లు సమాచారం. శ్రీహరి హామీలతో గ్రామాభివృద్ధికి అవకాశం రావడంతో తండా ప్రజలు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ తీగల సాంబరాజు యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో మా తండా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తాను అని తెలిపారు.


