జోరుగా కాంగ్రేస్ శ్రేణుల ప్రచారం
కాకతీయ,హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రేస్ శ్రేణుల ప్రచారం జోరుగా సాగుతుంది. మున్సిపాలిటీలో పదకొండవ వార్డ్ లో పూదరి వరప్రసాద్ తరుపున కాంగ్రేస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జోరుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రేస్ పార్టీ అధికారం లోకి వచ్చాక చేస్తున్న అభివృద్ధి ఓటర్ల కు వివరించుకుంటూ ప్రచారం నిరహిస్తున్నారు. ఈ కార్యక్రమం లో అభ్యర్థి పూదరి వరప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రేస్ ప్రభుత్వం లో హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది అని వార్డ్ ప్రజలకు ఏ సమస్య వచ్చిన ముందండి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు వార్డ్ అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రేస్ పార్టీ మహిళా నాయకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి, కోహెడ మండల్ పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య పదకొండవ వార్డ్ ఇంచార్జ్ లు బండిపెల్లి నారాయణ, కర్ర రవి, పాము శ్రీకాంత్, నాయకులు, వేల్పుల వెంకట స్వామి పిల్లి సత్తయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



