కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు
బీజేపీని ఎదుర్కొనేందుకు దోస్తీ
పంచాయతీ ఎన్నికల్లో 300కుపైగా సర్పంచ్‌లు
రెండు, మూడో విడతల్లోనూ ఇంతకంటే ఎక్కువ స్థానాలు
కాకిలెక్కలు చెప్తున్న ఆ రెండు పార్టీలు
సర్‌పై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటి అవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పెద్దఎత్తున పోటీ చేశారని అన్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాలతోపాటు మిగతా జిల్లాల్లో కూడా పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించారన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్నారు. భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన వారికి రాష్ట్ర పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే రెండు విడతల్లోనూ భారతీయ జనతా పార్టీని ఆదరించి, ఆశీర్వదిం చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తొలిసారి వార్డుల వరకూ వెళ్లాం
గతంలో మాకు ఒక్క సర్పంచ్ కూడా లేని జనగామలో 2, మహబూబాబాద్‌లో ఆరు గెలిచాం. భూపాలపల్లి లో మూడు, సంగారెడ్డిలో ఆరు గెలిచాం, వనపర్తిలో ఆరు గెలిచాం, నాగర్ కర్నూల్‌లో మూడు గెలిచాం. ఇవాళ వార్డు సభ్యులతోపాటు ఉపసర్పంచ్ కూడా చాలామంది బీజేపీ మద్దతుతో విజయం సాధించామన్నారు. ఈరోజు మేము గెలవని జిల్లా లేదు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 300కుపైగా సర్పంచ్ స్థానాలను గెలిచిందని రామచంద్రరావు అన్నారు. రెండు, మూడో విడతల్లోనూ ఇప్పటికంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామన్నారు. మొదటిసారి మా ప్రయత్నంలో బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లోని వార్డు వార్డుకు వెళ్ళిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపించారు.
సర్‌పై వర్క్‌షాప్
సర్‌పై బీజేపీ జాతీయ మీడియా విభాగం నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ జరిగింది. బీజేపీ రాష్ట్ర పతాధికారులు, అధికార ప్రతినిదులు, మీడియా విభాగంతో పాటు పలువురు నాయకు ఈ వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రత్యూష్ కాంత్ వర్చువల్‌గా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, వాస్తవాలను వివరించారు. ఎస్ఐఆర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని పార్టీ ప్రతినిధులకు మరోసారి వినిపించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావుతో పాటు పతాధికారులు, అధికార ప్రతినిదులు, మీడియా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు


