నర్సంపేటలో కాంగ్రెస్ దూకుడు
ఆరు వార్డుల్లో ఫలితాలు స్పష్టం
మరో ఐదు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం
ఒక వార్డులో సీపీఎం ఖాతా ఓపెన్
మిగిలిన వార్డుల ఫలితాలపై ఉత్కంఠ
కాకతీయ, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా, ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రకటించిన ఆరు వార్డుల్లో ఐదు వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో పట్టణంలో పార్టీ దూకుడు కనిపిస్తోంది. ఒక వార్డులో సీపీఎం విజయం సాధించి తన ఖాతా తెరిచింది. 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కొత్తకొండ మేఘన విజయం సాధించారు. అలాగే 4వ వార్డులో బీరం భారత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. 10వ వార్డులో మాత్రం సీపీఎం అభ్యర్థి హనుమకొండ శ్రీధర్ విజయం సాధించి ఎడమపక్షాలకు తొలి విజయాన్ని అందించారు. ఇక 16వ వార్డులో అజ్మీరా మెగ్య కాంగ్రెస్ తరఫున గెలుపొందగా, 22వ వార్డులో బాణాల ప్రసన్న కుమారి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 25వ వార్డులో పెండెం శ్రీలక్ష్మి కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ ఆధిక్యాన్ని మరింత బలోపేతం చేశారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం నర్సంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలంగా నిలుస్తున్నట్లు స్పష్టమవుతోంది. మిగిలిన వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉండటంతో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కుతుందన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
సొంత అన్నపై తమ్ముడు భరత్ రెడ్డి విజయం
నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం భరత్ రెడ్డి 4వ వార్డు నుంచి తన సొంత అన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం నాగిరెడ్డి పై 26 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


