కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవంజి దీప్తి ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌లో జరిగే విర్ట్యూస్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 లో ఆదివారం జరిగిన ఫైనల్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ విజయానికి రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆమెకు హార్థిక అభినందనలు తెలిపారు. సీఎం ముఖ్యంగా జీవంజి దీప్తి, ఆమె కోచ్, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ, దేశ నలుమూలలలో కాకతీయ గడ్డకు చెందిన జీవంజి దీప్తి పేరు తార స్థాయిలో నిలిచిపోయిందన్నారు. ఆమె మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.


