కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వ్యాప్తంగా 2025లో నిర్వహించబోయే జడ్పిటిసి ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయని తొలుత ప్రకటించిన అధికారులు వివిధ రాజకీయ పార్టీల నేతలు అభ్యంతరం చెప్పడంతో రిజర్వేషన్ ప్రక్రియను వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
ములుగు జిల్లా మంగపేట మండలంలో ట్రైబల్, నాన్ ట్రైబల్ వివాదం దృశ్య మంగపేట మండలంలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు జరగటంలేదని విషయం తెలిసిన మంగపేట మండలాన్ని జడ్పిటిసి స్థానాల జాబితాలో ఉంచి రిజర్వేషన్లను ఖరారు చేయటంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు అభ్యంతరం తెలపడంతో జిల్లా అధికారులు వెనక్కి తగ్గి మళ్లీ రిజర్వేషన్లను పునరుద్ధరించే పనిలో పడ్డారని, ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.


