కాకతీయ పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామానికి చెందిన మంకల కొమురమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తోటకూరి శ్రీనివాస్ మృతదేహానికి పూలమాల వేసి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని భరోసానిచ్చారు. అయన వెంట ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దల స్వామి, గ్రామ పార్టీ అధ్యక్షుడు బొమ్మరబోయిన రవి,యూత్ అధ్యక్షుడు గాదె రాజు,వెంకటేష్, రాజు, సుధాకర్, సాగర్, శ్రీకాంత్, బలరాం, సందీప్, సుధాకర్, అశోక్,సోమాచారి తదితరులు ఉన్నారు.


