మృతురాలి కుటుంబానికి ఇనుగాల పరామర్శ
కాకతీయ, గీసుగొండ : కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడి తల్లి మృతి చెందగా వారి కుటుంబాన్ని కుడా చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి పరామర్శించారు. మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కూసం రమేష్ తల్లి కూసం మల్లికాంబ అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఇనుగాల వెంకట్రామిరెడ్డి గురువారం వారి స్వగృహానికి చేరుకున్నారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆరకట్ల సాయి, కందికొండ రాజు, మేకల అనిల్ తదితరులు పాల్గొన్నారు.


