మాజీ సర్పంచ్ అరుణ కుమారి మృతికి నామ సంతాపం
ఫోన్‌లో మాట్లాడి కుటుంబానికి పరామర్శ
కాకతీయ, ఖమ్మం : జాలిముడి గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల అరుణ కుమారి మృతి పట్ల బీఆర్ఎస్ మాజీ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. గ్రామ సర్పంచ్‌గా ఆమె ప్రజలతో ఆత్మీయంగా మమేకమై, గ్రామాభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ మధిర మండల ప్రధాన కార్యదర్శి *బొగ్గుల భాస్కర్ రెడ్డి*తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకుని పరామర్శించారు. అరుణ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


