బీజేపీతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి
బీజేపీ నేత లేగా రాం మోహన్ రెడ్డి
కాకతీయ, తొర్రూరు : ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అమ్మాపురం గ్రామంలో బీజేపీ తరఫున గెలుపొందిన ఉపసర్పంచ్ సిరిపాటి విశాల్‌తో పాటు వార్డు సభ్యులు పురాణపు బూబా మహేష్, గంధం యాకమ్మలను బీజేపీ తొర్రూరు రూరల్ మండల శాఖ అధ్యక్షుడు గట్టు రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగా రాం మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లేగా రాం మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ పట్టణాలకే పరిమితమని కొందరు చేస్తున్న విషప్రచారానికి తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నుంచి వేయి మందికి పైగా సర్పంచులు, 1200 మంది ఉపసర్పంచులు, 10 వేలకుపైగా వార్డు సభ్యులు గెలిచి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 72 మంది సర్పంచులు, 150 మంది వార్డు సభ్యులు బీజేపీ తరఫున పోటీ చేసినట్లు తెలిపారు.
గ్రామాలకే కేంద్ర ప్రాధాన్యం
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద తెలంగాణ రాష్ట్రానికి మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి నిరంతరం పనిచేసే పార్టీ బీజేపీ మాత్రమేనని, బీజేపీతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని లేగా రాం మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లె కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు అలిసేరి రవిబాబు, అర్బన్ అధ్యక్షుడు పైండ్ల రాజేష్, మండల ప్రధాన కార్యదర్శి కొండా యాకన్న, కిన్నెర రాజ్ కుమార్, కడెం పాండు, డొనుక శ్రీరాములు, కిన్నెర శ్రీనివాస్, మహేష్, సతీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


