- గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది
కాకతీయ, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఎంపీడీవో గుగులోత్ కిషన్ పై తూర్పాటి స్వప్న భర్త లేట్ మల్లేష్( టైపిస్టు )కలెక్టర్ కు చేసిన ఫిర్యాదు సరైనది కాదని మండల గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది అన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ అనాలోచితంగా ఇచ్చిన ఫిర్యాదును ఖండిస్తున్నామన్నారు. కార్యాలయంలో ఏ ఒక్కరితో కూడా ఎంపీడీవో ఏనాడూ దుర్భాషలాడలేదని అన్నారు. ఒక అధికారిగా కాక స్వంత తండ్రివలే తమపై ఆధార అభిమానాలు చూపిస్తూ, వృత్తిపరంగా ఎదగడానికి సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తారు. తమకు వచ్చే బెనిఫిట్స్ గుర్తు చేసి సకాలంలో మంజూరు చేయిస్తున్నారని కొనియాడారు. సుమారు 70 మంది పనిచేస్తున్న కార్యాలయంలో ఇప్పటివరకు ఎవ్వరిని డబ్బులు అడగలేదని పేర్కొన్నారు. ఒక్క తూర్పాటి స్వప్నను మాత్రమే ఎందుకు డబ్బులు అడుగుతారని ఎదురు ప్రశ్నించారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం తమ తోటి ఉద్యోగులతో జరిపిన లావాదేవీలను ఎంపీడీవో, సిబ్బందిపై చేసిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కరుణశ్రీ, జయంతి, సుమలత, బత్తుల నర్సయ్య, పద్మ నాభా స్వామి, శ్రీనివాస్, ఒడ్డెపల్లి రాజు, మహేందర్, శాంతి రాజు తదితరులు పాల్గొన్నారు.


