కాకతీయ, కరీంనగర్: ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్యకిరణ్ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం వైన్ షాపులు సిండికేట్‌గా ఏర్పడి బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనుమతుల లేని పర్మిట్ రూములలో సిట్టింగ్ ఏర్పాటు చేసి కల్తీ ఆహార పదార్థాలు విక్రయించడం, అంగన్వాడి గుడ్లు కూడా పర్మిట్ రూములలో లభించడం దారుణమని పేర్కొన్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందని, యువత మద్యానికి బానిసై జీవితం నాశనం అవుతున్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని హుజరాబాద్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐకి ఫిర్యాదు చేశారు.
అవసరమైతే ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని, లిక్కర్ మాఫియాపై చర్యలు లేకపోతే ఆందోళనలు తప్పవని కొలుగూరి సూర్యకిరణ్ హెచ్చరించారు.


