కాకతీయ, వరంగల్: రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి. మంచిర్యాల్ నుండి వరంగల్, హనుమకొండ జిల్లాల మీదుగా వెళుతుంది. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. రెండు సంవత్సరాలలో రహదారి నిర్మాణం పూర్తి చేస్తామని గుత్తేదారులు తెలిపారు.
కానీ ఇప్పటికీ భూ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం రోజున గ్రీవెన్స్ సెల్ లో భూ నిర్వాసిత రైతులతో కలిసి ఎర్రబెల్లి ప్రదీప్ రావు రైతుల తరఫున వరంగల్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ ప్రదీప్ రావు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితుల రైతులు అందరూ కూడా చిన్న కారు రైతులు, వ్యవసాయం మీదనే జీవనం కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వం రైతులకు త్వరగా నష్టపరిహారాన్ని అందించి, పేద రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్నే రవీందర్, రైతులు రామ్ చందర్, నల్లపు దేవేందర్, రాములు, బిక్షపతి, అజిత్ పాషా, దేవేందర్, మిట్టు, రమేష్, ఎరుకల రమేష్ తదితర రైతులు పాల్గొన్నారు.


