నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి
కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్ – 2 ప్రాజెక్టు ప్రారంభంతో ఆర్కే 4 గడ్డ శాంతినగర్ కాలనీకి చెందిన నివాసిత కుటుంబాలకు సరైన పరిహారంతో పాటు గృహ నిర్మాణాలకై స్థలాలు,పునరావాస సౌకర్యాలు సింగరేణి యాజమాన్యం కల్పించాలని స్థానిక నివాసితులు డిమాండ్ చేశారు. గతంలో ప్రారంభమైన ఫేజ్ – 1 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుతో పెదేళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు వారు గుర్తు చేశారు. సుమారు 250 ప్రభావిత కుటుంబాలు శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి వినతి పత్రాన్ని అందించారు. అలాగే ఆర్డిఓ శ్రీనివాస్,క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు,మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ లకు సైతం వినతి పత్రాన్ని అందించినట్లు చెప్పారు. ప్రజల ప్రాణ,ఆస్తుల భద్రత పరంగా అధికారులు తగు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.


