పూర్తయిన పనులను పరిశీలించిన కమిషనర్
కాకతీయ, వరంగల్ : వరంగల్ నగర పరిధిలో ఇటీవల చేపట్టి పూర్తిచేసిన పలు అభివృద్ధి పనులను కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. బుధవారం ఏనుమాముల మార్కెట్, కొత్తవాడ 80 ఫీట్ల రోడ్, అండర్ బ్రిడ్జి, రంగశాయి పేట, కరీమాబాద్ ప్రాంతాల్లో కమిషనర్ పూర్తి చేసిన బీటీ, సిసి రోడ్లు, డ్రైన్లను ఎంబి (మెజర్మెంట్ బుక్) లో నమోదు చేసిన కొలతల ఆధారంగా పరిశీలించారు. వీటి ఆధారంగానే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఈఈ సంతోష్ బాబు, డీఈ రంగారావు తదితరులు పాల్గొన్నారు.


