రేయిన్‌కోర్టులు పంపిణీ చేసిన కమిషనర్ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : వర్షాకాలం, చలికాలం దృష్ట్యా పోలీసు సిబ్బంది హోం గార్డ్స్‌కు రేయిన్‌కోర్టులు, శీతాకాలపు స్వెటర్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పంపిణీ చేశారు.కమిషనరేట్ పరిధిలోని సుమారు 300 మంది హోం గార్డ్స్ కు ఈ సామగ్రిని పంపిణీ చేసినట్లు కమిషనర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.వర్షాకాలం, చలికాలం సమయంలో విధుల్లో తడవకుండా చలికి గురికాకుండా ఉండేందుకు ఈ రేయిన్‌కోర్టులు, స్వెటర్లు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు వీటిని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) భీంరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రజినీకాంత్, శ్రీధర్ రెడ్డి, హోం గార్డ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


