epaper
Sunday, March 1, 2026
epaper

బహిరంగ చర్చకు రా !

  • రెండేండ్ల కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలపై తేల్చుకుందాం..
  • హైద‌రాబాద్‌ను ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చకు రెడీనా ?
  • కమాండ్‌ కంట్రోలా, గాంధీ భవనా, అసెంబ్లీనా ? ఎక్కడైనా సిద్ధం..
  • రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్‌
  • జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామనే ఫ్రస్టేషన్లో సీఎం అంటూ ఫైర్‌
  • జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రగతి నివేదిక విడుద‌ల‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధిపై, కాంగ్రెస్‌ అభివృద్ధికి చర్చకు సిద్ధమా..? జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, అసెంబ్లీ, గాంధీభవన్‌ ఎక్కడికి రమ్మన్నా వస్తా.. ? అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రగతి నివేదికను కేటీఆర్ బుధవారం విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఓటమి భయంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై చర్చకు రేవంత్‌ సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరారు. రేవంత్ రెడ్డికి ఆయన భాషలో ఆయనకు అర్థమైయేటట్లు చెప్పే సత్తా తమకు ఉందని అన్నారు. కానీ రేవంత్‌ రెడ్డి మమ్మల్ని తిట్టినా.. మేం మాత్రం గౌరవంగానే మాట్లాడుతామని స్పష్టంచేశారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఏం చేసిందో.. రెండేళ్లలో రేవంత్‌ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందామ‌ని.. దీంతో చెత్త ఎవరిది.. సత్తా ఎవరిదో తేలిపోతుందని అన్నారు.

రేవంత్‌ ప్రభుత్వం గుంతలైనా పూడ్చిందా?

కేసీఆర్‌ హయాంలో ఫ్లై ఓవర్లు, అండర్‌పాసులు నిర్మించామన్నారు. రేవంత్‌ ప్రభుత్వం కొత్తగా ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టిందని.. రేవంత్‌ ప్రభుత్వం కనీసం రోడ్లపై పడిన గుంతలనైనా పూడ్చిందా? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని తీర్చేదెవరో ప్రజలందరికీ తెలుసునని, కాంగ్రెస్‌ హయాంలో మంచినీటి కష్టాలు మొదలయ్యాయన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 3వేల నుంచి 7.5 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరణ జరిగిందని.. కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్లలో హైదరాబాద్‌ను క్లీన్‌ సిటీగా మార్చిందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ను మురికికూపంగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో పవర్‌ హాలీడేలు విధించేవారని, కేసీఆర్‌ పాలనలో24గంటలు నాణ్యమైన కరెంట్‌ అందించామన్నారు.

గ్రీన్‌ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం..

కేసీఆర్‌ హయాంలో విద్యుత్‌ వెలుగులు నిండాయని, గ్రీన్‌ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామన్నారు. 16వేల నర్సరీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. హెచ్‌సీయూలో జీవవైవిధ్యాన్ని నాశనం చేసిన ఘనత రేవంత్‌రెడ్డిదన్నారు. రేవంత్‌ బెదిరింపులకు ఎన్నో పరిశ్రమలు తరలిపోతున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారాయని విమర్శించారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ డ్రగ్స్‌ దందాను పట్టుకున్నారని, రూ.12వేల డ్రగ్స్‌ దొరికితే పట్టింపులేదా?.. తెలంగాణ ముఖ్యమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. జూబ్లీహిల్స్‌ అభివృద్ధి రిపోర్ట్‌ను ఇంటింటికీ పంపిస్తామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.5,328 కోట్లు ఖర్చు చేశామని.. మెట్రోపై రూ.1,722 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

204 గురుకులాలు ఏర్పాటు చేశాం..

పండుగల కోసం 14కోట్లు అందించామని, అన్నపూర్ణ భోజనాల కోసం రూ.2కోట్లు చెల్లించినట్లు వివరించారు. మైనారిటీల కోసం 204 గురుకులాలను ఏర్పాటు చేశామని, రూ.51కోట్లతో గురుకులాలన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బోరబండలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.87కోట్లు ఖర్చు చేశామని, రూ.17కోట్లతో ఫంక్షన్‌ హాలు నిర్మించినట్లు తెలిపారు. రూ.455 కోట్లతో పది సబ్‌స్టేషన్లను కట్టామని, జూబ్లీహిల్స్‌లో విద్యుత్‌ నిర్వహణ కోసం రూ.505కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు రూ.30కోట్లు ఖర్చు చేశామన్న కేటీఆర్‌.. రూ.180కోట్లు మంచినీటి కోసం ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. పార్కుల నిర్వహణకు రూ.20కోట్లు, డీఆర్‌ఎఫ్‌ పెట్టి ప్రజలకు సహాయక చర్యలు అందించామన్నారు.

రెండేళ్ల పాలనలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలి

బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.5328 కోట్లు ఖర్చు చేస్తే.. రెండేళ్ల రేవంత్‌ పాలనలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధిని చూపించి రేవంత్‌ ఓట్లు అడగాలని, గోపీనాథ్‌ వేసిన శిలాఫలకం జూబ్లీహిల్స్‌లో ఎక్కడికి పోయినా కనిపిస్తుందన్నారు. జూబ్లీహిల్స్‌లోని ప్రతీ ఇంటికీ ప్రగతి ప్రస్థాన నివేదికను పంపిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌లో 34 అవార్డులు వచ్చాయని.. రేవంత్‌ పాలనలో ఎన్ని వచ్చాయని ప్రశ్నించారు. ప్రజలే న్యాయనిర్ణేతలని.. జూబ్లీహిల్స్‌లో సరైన జవాబిస్తారన్నారు. రేషన్‌కార్డుల పంపిణీని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎక్కువ ప్రచారం చేయలేదని, కాంగ్రెస్‌ అభివృద్ధి చేయలేక రేషన్‌కార్డులు ఇచ్చామని ప్రచారం చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధిపై, కాంగ్రెస్‌ అభివృద్ధికి చర్చకు సిద్ధమా? టైమ్‌, ప్లేస్‌ చెబితే ఎక్కడికైనా వస్తామన్నారు. జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, అసెంబ్లీ, గాంధీభవన్‌ ఎక్కడికి రమ్మన్నా వస్తామని.. చర్చకు సిద్ధమా ? అంటూ సవాల్‌ విసిరారు కేటీఆర్‌.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img