కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత పనులను వేగవంతంగా పూర్తి చేయాలని
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను ఆకస్మికంగా పరిశీలించారు. గోదావరిఖని పట్టణంలోని 49వ డివిజన్ మార్కండేయ కాలనీలో జరుగుతున్న కాలువ పూడికతీత పనులు, ఎన్టీపీసీ పరిధిలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, రామగుండం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, లింగాపూర్ సమీపంలోని రోడ్డు విస్తరణ పనులు, పైప్‌లైన్ మార్పిడి పనులు, మండల పశువైద్యశాల, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, అంతర్గాం మండలంలోని కుందనపల్లి కేజీబీవీని తనిఖీ చేశారు. గోదావరిఖని పట్టణంలో కాలువ పూడికతీత పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. రామగుండం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్, భోజనశాల నిర్మాణ పనులను వచ్చే మే నెలలోపు పూర్తి చేసి కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ డీఈ అప్పల్‌నాయుడు, ఏఈ రాజ్‌కుమార్, రోడ్లు–భవనాలు శాఖ ఏఈ జావిద్ తదితరులు పాల్గొన్నారు.


