epaper
Monday, March 2, 2026
epaper

వలస కూలీల పిల్లలకు కలెక్టర్ పూర్తి సహకారం

వలస కూలీల పిల్లలకు కలెక్టర్ పూర్తి సహకారం
ఇటుక బట్టీల్లోని చిన్నారులను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలి
గట్టుబూత్కూరు పాఠశాలలో ప్రత్యేక క్లాస్‌ ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి

కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో వలస కార్మికుల పిల్లలు విద్యకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం గంగాధర మండలం గట్టుబూత్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వలస కూలీల చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతి గదిని ఆమె ప్రారంభించారు. ఇప్పటికే గుర్తించిన 42 మంది పిల్లలకు ఇక్కడ ప్రాథమిక విద్య బోధిస్తున్నారు.తరగతి గదిలో పిల్లలను పలకరిస్తూ వారి భాష, స్వస్థలం, కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.జిల్లాలోని వలస కూలీల పిల్లలందరినీ గుర్తించి సమీప పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల ద్వారా విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది సుమారు 500 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్చామని, ఈ సంవత్సరం మరింత విస్తృత స్థాయిలో తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు.పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, పోషకాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు పెట్టనున్నట్లు వెల్లడించారు. వలస కూలీల పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులను ఆదేశించారు. ఇటుక బట్టీల యజమానులతో చర్చించి పాఠశాల వరకు రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు.వివిధ రాష్ట్రాల నుండి వచ్చే పిల్లల దృష్ట్యా వారికి ఇంగ్లీషు బోధనను ప్రాధాన్యతగా కొనసాగించాలని, ముఖ్యంగా గణితం–ఇంగ్లీషు సబ్జెక్టులపై దృష్టి పెట్టాలని వాలంటీర్లకు సూచనలు ఇచ్చారు. యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్కులు తదితర అవసరమైన పాఠ్య సామగ్రిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

పూర్వ ప్రాథమిక పాఠశాల పరిశీలన

తరువాత కలెక్టర్ పమేలా సత్పతి పూర్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. చిన్నారులతో మమేకమై వారి అభ్యాస పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఆటపాటల ఆధారిత బోధనను మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వం పంపిన ఆటవస్తువులు, పుస్తకాలు పూర్తిగా వినియోగించాలన్నారు. పూర్వ ప్రాథమిక విద్యార్థుల నమోదు, హాజరు శాతం పెంపు పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట తహసీల్దార్ రజిత, మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img