కాకతీయ, ములుగు: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ డాక్టర్ శబరీష్ శుక్రవారం అధికారులు, పోలీస్ సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద విస్తరణ ప్రణాళికలను పరిశీలించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, వీఐపీ, వీవీఐపీ ప్రవేశం, భద్రతా ఏర్పాట్లపై క్షుణ్ణంగా సమీక్షించారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ భక్తులు నిరంతరంగా సౌకర్యంగా దర్శనం చేసుకునే విధంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ములుగు డీఎస్పీ రవీందర్, దేవస్థానం ఈఓ వీరస్వామి, డి.ఈ.సి.హెచ్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


