మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్
మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం
కాకతీయ,ములుగు ప్రతినిధి: మార్కెట్ లైసెన్స్ జారీలో జరుగుతున్న ఆలస్యానికి సంబంధించి మంగళవారం కాకతీయ దినపత్రికలో వెలువడిన వార్తకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వారి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇలాంటి ఇబ్బందులు పడవద్దని, మార్కెట్ లైసెన్స్ జారీ చేయడంలో ఆలస్యం అవ్వడం వల్ల వరి ధాన్యం డబ్బులు రైతుల కు చేరే విషయంలో ఎలాంటి సమస్య ఉండకూడదంటూ ఆదేశించిన తెలుస్తోంది. ఈ విషయమై బుధవారం వ్యవసాయ మార్కెట్ అధికారులకు, జిల్లాలోని రైస్ మిల్లర్లను పిలిచి సమావేశపరిచినట్లు మార్కెట్ లైసెన్స్ జారీలో నెలకొన్న గందరగోళాన్ని అతి త్వరలో పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
కాకతీయ ఎఫెక్ట్ :



