లెవల్ కాజ్ వేలను పరిశీలించిన కలెక్టర్ సత్య శారద
కాకతీయ, నర్సంపేట : వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వివిధ శాఖల అధికారులతో కలసి శనివారం నర్సంపేట డివిజన్, ఖానాపూర్ మండలం లోని అశోక్ నగర్ పాకాల చెరువు నుండి వచ్చే వరద నీటి లో లెవల్ కాజ్ వే ను, నల్లబెల్లి మండలం లోని లకినేపెల్లి గ్రామం వద్ద కాజ్ వే, నర్సంపేట నుండి చెన్నారావుపేట వెళ్లే రహాదారిలో ముగ్దుంపుర వద్ద, నర్సంపేట లోని మాదన్నపేట వద్ద కాజ్ వేలను పరిశీలించారు. కాజ్ వే ల వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను పరిశీలించి సమర్ధ నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెరువులలో నీటిమట్టం ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులలో, లో లెవెల్ కాజ్వే లపై మీదుగా నీరు ప్రవహిస్తున్నందున ప్రజలకు వెళ్లడానికి అనుమతించవద్దని, చెరువులలో ప్రజలను చేపలు పట్టే వారిని రైతులను పశు కాపరులను సందర్శకులను అనుమతించవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి, ఆర్డిఓ ఉమారాణి డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు , జిల్లా పంచాయతీ అధికారి కల్పన, తాహసిల్దారులు, ఎంపీడీవోలు, పోలీసు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


