కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోనీ ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు లోని ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాములకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.


