epaper
Wednesday, March 25, 2026
epaper

డ‌బ్బులిస్తేనే లోడింగ్‌.. మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి ఇసుక‌ క్వారీలో వ‌సూళ్లు

డ‌బ్బులిస్తేనే లోడింగ్‌
మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి ఇసుక‌ క్వారీలో వ‌సూళ్లు
లారీల ఓన‌ర్ల నుంచి రూ.3500 అక్ర‌మంగా డిమాండ్
డ‌బ్బులివ్వ‌ని లారీల‌ను ప‌క్క‌న పెట్టిన నిర్వాహాకులు
టీజీఎండీసీ డీడీకి అద‌నంగా చెల్లింపులకు హుకుం
ఇటీవ‌ల టీజీఎండీసీ అధికారుల ఆదేశాలు బేఖాతార్‌
భూపాల‌ప‌ల్లి జిల్లాలో కొన‌సాగుతున్న అక్ర‌మాలు
క‌లెక్ట‌ర్ దృష్టి పెట్టాల‌ని కోరుతున్న లారీల ఓన‌ర్లు
లేదంటే క‌లెక్ట‌రేట్ ఎదుట ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని బాధితుల ఆవేద‌న‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం బ్రాహ్మణపల్లి ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని లారీ యజమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రూ.1650 నుంచి ఒక్కో లారీకి రూ.3500 వరకు డిమాండ్ చేస్తున్న‌ట్లు వాపోతున్నారు. డబ్బులు చెల్లించని వాహనాలను పక్కన పెట్టి లోడింగ్ చేయకుండా నిలిపివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో రోజువారీ ఆదాయం మీద ఆధారపడే లారీ డ్రైవర్లు, యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు గంటల తరబడి వేచి చూసినా లోడింగ్ జరగకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇటీవల టీజీఎండీసీ అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, క్వారీ నిర్వాహకులు వాటిని పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు. డీడీ చెల్లింపులు చేసిన తర్వాత కూడా అదనంగా డబ్బులు వసూలు చేయడం వెనుక ఉన్న అసలు కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెరుగుతున్న అక్రమాలు… ఆందోళన హెచ్చరిక

భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి అక్రమాలు విస్తరిస్తున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ దందాపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లారీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను పరిష్కరించకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. అధికార యంత్రాంగం తక్షణం స్పందించి పారదర్శకంగా ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇసుక లోడింగ్ కోసం అదనపు డబ్బులు వసూలు చేయడం పూర్తిగా అన్యాయమని లారీ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీజీఎండీసీకి డీడీ చెల్లించినప్పటికీ మరోసారి డబ్బులు అడగడం దందాగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ.. కాకతీయ, వరంగల్ బ్యూరో (...

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప కాకతీయ, ఖిలావరంగల్: కాపు...

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే...

సోలార్‌తో ఆదాయం ఆదా

సోలార్‌తో ఆదాయం ఆదా సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ డాక్టర్ సత్య...

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు అన్నం ఉడ‌క‌లేద‌ని,...

రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం

రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ స‌త్య శార‌ద‌ కాకతీయ,...

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కాకతీయ, నూగూరు వెంకటాపురం : మండల కేంద్రంలో...

శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కాకతీయ, రాయపర్తి : మండలంలోని ఆరేగూడెం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img