epaper
Sunday, March 8, 2026
epaper

సింగరేణిలో బొగ్గు కుంభకోణం

సింగరేణిలో బొగ్గు కుంభకోణం
సీబీఐతో ద‌ర్యాప్తు చేయిస్తే అనేక అక్ర‌మాలు వెలుగులోకి
రేవంత్–బామ్మర్ది సృజన్ పాత్రపై ఆరోపణలు
టెండర్ నిబంధనల మార్పుతో వేల కోట్ల నష్టం
అంతర్గత విచారణ సరిపోదు… సీబీఐకే అప్పగించాలి
దర్యాప్తు కోరుతూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి హ‌రీష్‌రావు లేఖ‌
సిట్‌కు వెళ్లే ముందే మీడియా సాక్షిగా లేఖ విడుదల

కాకతీయ, తెలంగాణ బ్యూరో : సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి. హరీశ్ రావు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి ఈ కుంభకోణానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంటూ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి *జి. కిషన్ రెడ్డి*కి లేఖ రాశారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు మీడియా సాక్షిగా ఆ లేఖను హరీశ్ రావు విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. లేఖలో హరీశ్ రావు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 2024లో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సింగరేణిలో టెండర్లకు “సైట్ విజిట్ సర్టిఫికేట్” అనే కొత్త నిబంధనను తప్పనిసరి చేశారని తెలిపారు. ఈ విధానం గతంలో సింగరేణిలో ఎప్పుడూ లేదని, దేశవ్యాప్తంగా కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ వంటి సంస్థల్లో కూడా అమలులో లేదని గుర్తుచేశారు. ఈ నిబంధన ద్వారా ముందుగానే కొందరికి లబ్ధి చేకూర్చేలా టెండర్లు మలచినట్టు అనుమానాలు వ్యక్తం చేశారు.

తక్కువ ధర టెండర్లు రద్దు… అధిక ధరలకు కట్టబెట్టడం

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మైనస్‌ 7 నుంచి మైనస్‌ 20 శాతం వరకు తక్కువ ధరలకు ఖరారైన టెండర్లను రద్దు చేసి, కొత్త విధానంలో ప్లస్‌ 7 నుంచి ప్లస్‌ 10 శాతం వరకు అధిక ధరలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. దీని వల్ల సింగరేణికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఈ మార్పులు ప్రజాధనానికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని లేఖలో వివరించారు. డీజిల్ కొనుగోలు విధానంపై కూడా హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలో ఐఓసిఎల్ నుంచి నేరుగా బల్క్ డీజిల్ కొనుగోలు చేసే విధానాన్ని నిలిపివేసి, కాంట్రాక్టర్లకు అప్పగించారని విమర్శించారు. దీంతో ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, అదనంగా జీఎస్టీ భారం పడుతోందని, ఇది సంస్థ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఎందుకు శాశ్వత సీఎండీ నియామ‌కం జ‌ర‌గలేదు

గత రెండేళ్లుగా సింగరేణికి శాశ్వత సీఎండీని నియమించకపోవడంపై హరీశ్ రావు ప్రశ్నలు లేవనెత్తారు. ఇన్‌చార్జ్ పాలనతో సంస్థ నడుస్తుండటంతో మానిటరింగ్ బలహీనమై, ఇష్టారాజ్య నిర్ణయాలకు దారి తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు నిబంధనల ఉల్లంఘనలపై మౌనంగా ఉండటంపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ లేదా అంతర్గత విచారణలు సరిపోవని, 2024 తర్వాత తీసుకున్న అన్ని టెండర్లు, పాలసీ నిర్ణయాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు వెలుగులోకి వస్తాయని హరీశ్ రావు కేంద్ర మంత్రికి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..! కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం సీపాత్...

సివిల్స్‌లో మెరిసిన యువత..!

సివిల్స్‌లో మెరిసిన యువత..! యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల విడుదల దేశవ్యాప్తంగా తొమ్మిది వందల...

గణపతి లొంగుబాటు..!

గణపతి లొంగుబాటు..! అజ్ఞాత జీవితం వీడిన మావోయిస్టు అగ్రనేత నలభై ఏళ్లకు పైగా మావోయిస్టు...

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఆక్రమణలు కోర్టు కేసులున్నా నిర్మాణాలు ప్రగతినగర్...

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు కేంద్ర కమిటీ ఘాటు హెచ్చరిక ఆర్థిక వ్యవహారాలపై అభ్యంతరాలు కుటుంబ...

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ గాంధీ కుటుంబానికి సంబంధించిన పెయిటింగ్‌ను జ్ఞాపిక‌గా...

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img