epaper
Monday, March 2, 2026
epaper

ఉప ఎన్నిక‌లో గెల‌వాల్సిందే..!!

హైద‌రాబాద్‌లో బ‌ల‌ప‌డ‌టానికి జూబ్లీహిల్స్ ఎన్నిక‌ను వినియోగించుకోవాలి

అభ్య‌ర్థి ఎంపిక నిర్ణ‌యం ఏఐసీసీ చూసుకుంటుంది

అభ్య‌ర్థి ఎవ‌రైనా గెలుపున‌కు అంద‌రం క‌ష్ట‌ప‌డుదాం

ఎన్నిక‌ ఫ‌లితం జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం

బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి

స‌ర్వేలు మ‌న‌కు అనుకూలంగా వ‌స్తున్నాయ్‌

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై సీఎం స‌మీక్ష రేవంత్ రెడ్డి స‌మీక్ష

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపున‌కు ప్రతీ ఒక్కరూ పని చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం ఖ‌చ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై ప్రభావం చూపుతుంద‌ని తెలిపారు. కాబ‌ట్టి ఈ ఉప ఎన్నిక‌ను కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌య్యే ఫ‌లితంగా చూడ‌కుండా..భ‌విష్య‌త్‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపే అంశంగా గుర్తించాల‌న్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేప‌థ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీలోని అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసాను ప్రజలకు కల్పించాలి. అభ్యర్థి ఎవరనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నిర్ణయిస్తుంఅని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని కూడా ఆయన సూచించారు.

ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి!

పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేత‌ల‌కు సూచించారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసా ప్రజల్లో కల్పించాల‌న్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే నమ్మకాన్ని సైతం ప్రజల్లో కల్పించాల‌న్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవర‌నే విషయాన్ని ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. అభ్య‌ర్థి ఎవ‌రైనా పార్టీ విజయం కోసం పని చేయాల్సిన బాధ్యత మ‌నంద‌రిపై ఉంటుంద‌న్నారు. మీ పని తీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు తాను సమాచారం తీసుకుంటానని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పని చేయాలని సూచించారు.

స‌ర్వేలు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నాయ్‌..!

ఉపఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి నేత‌ల‌కు తెలిపారు. గ‌తంలో చేయించిన స‌ర్వేల్లో కంటే ప్రస్తుతం మనం చాలా మెరుగయ్యామని మంత్రుల‌తో అన్నారు. సానుభూతి ఎజెండాగానే ఈ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వెళ్తుందన్నారు. కానీ మనం మాత్రం అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉందంటూ స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో పుంజుకోవడానికి ఈ ఎన్నికలను సమర్థవంతంగా వినియోగించుకోవాల‌ని సూచించారు.

ఈ నెల‌లోనే నోటిఫికేష‌న్‌..?!

సెప్టెంబర్ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంద‌ని స‌మాచారం. ఈనేప‌థ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్‌, బీజేపీలు ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ‌పై క‌స‌ర‌త్తును ముమ్మ‌రం చేశాయి. ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎంపిక‌పైనే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అధికార పార్టీ అభ్య‌ర్థి రేసులో నవీన్‌ యాదవ్‌, బొంతు రామ్మోహన్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌లు పోటీలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికపై సీక్రెట్‌ సర్వే రిపోర్ట్‌ను సీఎంకు అందిన‌ట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

తాను సికింద్రాబాద్‌ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానని అధిష్ఠానానికి చెప్పుకోవ‌డంతో అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో అధిష్ఠానం ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అంజ‌న్‌కుమార్ యాద‌వ్‌ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి ఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మ

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img