కాకతీయ, తాడ్వాయి : మహ జాతర సమీపిస్తుంది. ఈ క్రమంలో జాతర పనులను పరిశీలించుటకు సిఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క సూచనల మేరకు హైదరాబాద్ లొ ముఖ్యులతో సమీక్షను నిర్వహించారు. శుక్రవారం ముగిసిన తర్వాత సి ఎం కార్యాలయం సి ఎంవొ సమాచారాన్ని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి ఎస్ కు తెలిపారు. ఈ క్రమంలో సి ఎం రేవంత్ రెడ్డి మేడారానికి రానున్నారు.
ఎట్టకేలకు మేడారం వచ్చె ముహూర్తం ఖరారైంది. ఈనెల 23 న వస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. మేడారంలో చేపట్టే పనులు ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ఆదివారం నుంచే ప్రణాళిక బద్దంగా ఎవరిని ఏమి అడుగుతారొ అనేది తెలియక ముచ్చెమటలు పడుతున్నాయి. తర్జన, భర్జన అవుతున్నారు.
ఎక్కడ పనులు వాటికి శంఖుస్థాపన చేస్తారో అనేది సి ఎం వొ వెల్లడించడంతో ఆ పనుల్లొ నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా గిరిజన పూజారులు, గిరిజనులతో మాట్లాడిన అనంతరమే గద్దెల ఆధునీకరణ చేస్తామని సి ఎం వెల్లడించారు. గద్దెలను పరిశీలించి అక్కడ చేపట్టే పనుల స్థితిగతులను పరిశీలించనున్నారు. అనంతరం హరితా హోటల్ ,రెవిన్యూ డైనింగ్ హాలులో సమీక్ష ఉంటుంది. సిఎం పర్యటన మేడారానికి ఖరారు కావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్ లొ గద్దెల వద్ద దిగగానే నేరుగా గద్దెల వద్దకు వెళ్తారు..ఆవరణ అంతా పరిశీలించి పూజారులు, గిరిజన పెద్దలతొ చర్చించుతారు.
తుపాకి నీడలొ సి ఎం రేవంత్ రెడ్డి మేడారానికి పర్యటన ఉండబోతోంది. ములుగు నుంచి మేడారానికి రోడ్డు పొడవున మూడంచల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ములుగు జిల్లా మావోయిస్టులకు పెట్టనికోటగా ఉంటుంది. దీన్ని దృష్టిలొ ఉంచుకుని అడుగడుగునా పొలీసులు ఆవరింపజేస్తున్నారు. మేడారం ఏరియా అంతా కూడా పోలీసుల మయం కానున్నది. ఆ రోజు పస్రా నుంచి తాడ్వాయికి, ఏటూరునాగారం నుంచి పస్రా ,ములుగు దాక స్పెషల్ బలగాలు ఉండబోతున్నాయి చీమ చిటుక్కున శబ్దం అయితే కాల్చివేతే అనే విధంగా నివేదిక ఆజ్ఞలు ఉండబోతున్నాయి. ఆ రోజు సామాన్యులు ప్రయాణం కష్టంగానే ఉండబోతుంది.


