రామన్నగూడెం లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కాకతీయ, నెల్లికుదురు : మండలం లోని రామన్నగూడెం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని భూతం మంజుల 20 వేలు, రావుల రాజు 25 వేలు, మల్యాల సాయిదమ్మ 25 వేలు, ఎడ్ల రామస్వామి 52 వేలు, మల్లికంటి జయమ్మ 21 వేల ఐదువందల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశామని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమలాంటి పేద ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల సతీష్, కొరిశెట్టి వెంకన్న, చీకటి జగదీష్, ఆకుతోట ప్రభాకర్, పాశం కొంరయ్య, కనకం మల్లయ్య, మల్యాల శ్రీనివాస్, పాశం వెంకన్న, వల్లపు రఘుపతి, ఆకుతోట సతీష్ మరియు కాసం లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


