epaper
Wednesday, March 25, 2026
epaper

మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై సీఎం స్పందించాలి

మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై సీఎం స్పందించాలి
సీఎం పర్యటనలో నిర్వాసితుల సమస్యలు ప్రస్తావించాలి
పునరావాసం, నష్టపరిహారాలపై స్పష్టత కోరిన సిఐటియు
కోర్టు తీర్పులు అమలు చేయాలని డిమాండ్
కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి
న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని సిఐటియు హెచ్చరిక

కాకతీయ, గజ్వేల్ : నర్మెట్టలో జరుగుతున్న రైతు పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై ముందుగా స్పందించి వారికి న్యాయం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో మాట్లాడిన ఆయన మల్లన్న సాగర్‌తో పాటు రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి, గౌరవెల్లి ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలను ప్రస్తావించిన తర్వాతే ఇతర అంశాలపై మాట్లాడాలని కోరారు. నిర్వాసితులను ఆదుకునేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూసేకరణకు వ్యతిరేకంగా నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిర్వాసితుల పక్షాన ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిరాహార దీక్ష చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాసితుల ఆందోళనలను పట్టించుకోకుండా ప్రాజెక్టు పనులు కొనసాగించిందని విమర్శించారు. ఇప్పటికీ సరైన నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీలు, ఇండ్లు, ప్లాట్లు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొందరు మానసిక వేదనతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు నిర్వాసితుల పక్షాన తీర్పులు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. వెంటనే జోక్యం చేసుకుని కోర్టు తీర్పులు అమలు చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత కుటుంబాలకు ఎలాంటి షరతులు లేకుండా రైతు బీమా, రైతు భరోసా తరహాలో దీర్ఘకాలిక సహాయం అందించే ప్రత్యేక పథకం ప్రకటించాలని కోరారు. గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, స్మశాన వాటికలు, విద్య, వైద్య సదుపాయాలు, రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను గుర్తుచేసుకుంటూ, నేడు నర్మెట్టలో జరిగే సభలో నిర్వాసితుల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వాసితులతో కలిసి ఐక్య పోరాటం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం

కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం కాకతీయ,చేర్యాల:మండలంలోని కొత్త దోమ్మాట గ్రామంలో...

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం

హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం ఆకునూరులో మెడికల్ మాఫియా బహిర్గతం ప్రథమ చికిత్స పేరుతో...

గ్రామ అభివృద్దే లక్ష్యం

గ్రామ అభివృద్దే లక్ష్యం రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ, చేర్యాల: మండలంలోని రాంపూర్...

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ప్రజాభిమానమే కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచారు మరో 20 ఏళ్ల వరకు...

అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి

అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్...

కామారెడ్డి డిక్లరేషన్‌కు కార్యరూపం ఎప్పుడూ..?

కామారెడ్డి డిక్లరేషన్‌కు కార్యరూపం ఎప్పుడూ..? బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్న ప్రతి బడ్జెట్‌లో...

ప్రజల ఎజెండాతోనే ముందుకు వెళ్తాం

ప్రజల ఎజెండాతోనే ముందుకు వెళ్తాం * రెవెన్యూ డివిజన్ లక్ష్యంగా ఉద్యమిస్తాం * ఏప్రిల్...

సమాజంలో శాంతి బలపడాలి

సమాజంలో శాంతి బలపడాలి చేర్యాల 11వ వార్డు కౌన్సిలర్ ఇజాజ్ అహ్మద్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img