సీఎం సభను విజయవంతం చేయాలి
నర్సంపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్
కాకతీయ, నర్సంపేట : ఈ నెల 5న నర్సంపేటలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ పిలుపునిచ్చారు. నర్సంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన యుత్ కాంగ్రెస్ సమావేశంలో నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ మాట్లాడారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు, సాగునీరు, మరియు పలు ప్రభుత్వ రంగ సంస్థల భవనాల నిర్మాణాలను చేపట్టి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నియోజకవర్గానికి ఎమ్మెల్యే దొంతి రప్పిస్తున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికీ 1000 కోట్ల నిధులను తీసుకొచ్చి ఈనెల 5న సీఎం రేవంత్ రెడ్డి తో ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లగౌడ్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పల్స ప్రశాంత్ గౌడ్, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్కే షఫిక్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, చెన్నారావుపేట మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద నరేష్, ఖానాపూర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొల్లం హరీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గద్ద అఖిల్, మహమ్మద్ సల్మాన్, దేశి సాయి పటేల్, మచ్చకంటి మనోజ్ కుమార్, మంచాల హరీష్, గద్ద నిఖిల్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.


