వెన్నం సోదరులకు.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ
రాఘవేందర్ రెడ్డి చిత్ర పటం వద్ద నివాళులు
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి లను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబాబాద్ జిల్లాలోని రెడ్యాల గ్రామంలో వెన్నం సోదరుల తండ్రి రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించగా వారి ఇంటికి చేరుకొని రాఘవేందర్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీఎం రాక సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల, భారీ నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సమాచార శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ, అటవీశాఖ ల మంత్రి కొండ సురేఖ, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పు రామచంద్రనాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ పాల్గొన్నారు.


