epaper
Monday, March 2, 2026
epaper

సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అల్ఫోర్స్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి రంగంలో అభివృద్ధి సాధించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విద్య, క్రీడ, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగి అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికీ అందిస్తున్నదని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, డిసిసి బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ లతో కలిసి కేక్ కట్ చేశారు.ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గుండాటి శ్రీనివాస్ రెడ్డి, డిసిసి ఎస్‌సి సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి నేతృత్వంలో భారీ కేక్ కట్ చేశారు.మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రజిత రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మైత్రి కన్వెన్షన్ వద్ద దీకొండ శేఖర్ ఆధ్వర్యంలో, హైమద్‌పుర చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ నేత మహమ్మద్ ఖలీం ఆధ్వర్యంలో కూడా వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి కృషి వలననే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగామని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.వేడుకల్లో శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, ముస్తాక్ అహ్మద్, బొబ్బిలి విక్టర్, కుర్ర పోచయ్య, వంగల విద్యాసాగర్, సలీముద్దీన్, చింతల కిషన్, కుంభాల రాజ్‌కుమార్, యనమల మంజుల, పర్వత మల్లేశం, అంజయ్య, ఈశ్వరి, నూనె గోపాల్ రెడ్డి, సుధాకర్ నాయక్, మాదాసు శ్రీనివాస్, మూల జైపాల్, సత్తినేని శ్రీకాంత్, స్వప్నశ్రీ, మాలోతు మహాలక్ష్మి, హైమద్, ఆమీర్ సిరిపురం నాగప్రసాద్, చింతల కిషన్, ఎలగందుల మునీందర్, భూసా ప్రశాంత్, అంజాద్ ముహమ్మద్, అతిబ్ సాదిక్, వాజిద్, ఎకరం సికందర్, సోహెల్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img