ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కాకతీయ, గీసుకొండ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని కొనాయిమాకుల గ్రామంలోని ఏకశిలా లారీ యూనియన్ అడ్డలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను ఓరుగల్లు లారీ యూనియన్, ఏకశిలా లారీ యూనియన్, ఆర్‌ఆర్‌ఆర్ చింతలపెళ్లి హమాలీ యూనియన్ సంయుక్తంగా నిర్వహించాయి.ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఓబీసీ సేవాదళ్ రాష్ట్ర నాయకుడు గోదాసి చిన్న,ఫర్టిలైజర్ కాంట్రాక్టర్ భౌరిశెట్టి నారాయణ పాల్గొని కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు,లారీ ఓనర్లు,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గోదాసి చిన్న మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచనల మేరకు అన్ని యూనియన్లు ఐక్యతతో ముందుకు సాగి డ్రైవర్లు, హమాలీల అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మండలంలోని మచ్చాపురం గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు.



