బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు ఎలగందుల రాజు
కాకతీయ, ఖానాపురం: మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన కొయ్యడి శ్రీను, మాద రాజు కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన రూ. 52 వేల విలువ గల చెక్కులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం ఖానాపురం మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ఎలగందుల రాజు గ్రామ పార్టీ అధ్యక్షుడు కావటి రమేష్, స్థానిక నాయకుల తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడే పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరప్రదాయని అని అన్నారు. పథకాలను బాధిత్ కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ మీసం రవీందర్ పార్టీ నాయకులు బొమ్మరబోయిన మహేష్, కుందనపల్లి జానయ్య, ఎలగందుల దేవేందర్, వడ్డే మల్లయ్య, ఏపూరి సంపత్, రాంబాబు, నరసయ్య, మొగిలి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.


