కేటీఆర్‌తో ఫుట్‌బాల్ ఎలా ఆడాలో సీఎంకు తెలుసు
అధికారం పోయిందనే అక్కసుతో హరీష్‌రావు
ఉపాధిహామీ చట్టానికి బీజేపీ ఉరేసింది
కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి కాంగ్రెస్ వ్యతిరేకం
27 లేదా 28న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు
బీఆర్ఎస్–బీజేపీపై మంత్రి సీతక్క ఫైర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె… ప్రజలు ఎప్పుడో బీఆర్ఎస్‌ను ఫుట్‌బాల్ ఆడుకున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌తో ఫుట్‌బాల్ ఎలా ఆడాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా తెలుసన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి ఆటగాడితో ఫుట్‌బాల్ ఆడిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
అధికారం కోల్పోయిన అక్కసుతోనే మాజీ మంత్రి హరీష్‌రావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తప్పుడు కూతలు, తప్పుడు మాటలు, గ్లోబల్ ప్రచారం చేయడంలో హరీష్‌రావును మించినవారు లేరని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు బీఆర్ఎస్‌కు పదేళ్లు అవకాశం ఇచ్చారని, సరిగా పని చేయకపోవడంతోనే అధికారాన్ని దూరం చేశారని స్పష్టం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, కాంగ్రెస్ కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ప్రజలే తగిన తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు. కవితకు జవాబు చెప్పలేకనే కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని, తప్పుడు ప్రచారాలు చేస్తే రాజకీయంగా ఫుట్‌బాల్ ఆడిస్తామని హెచ్చరించారు. అధికారం పోయిన తర్వాత కొందరు తమ ఇంట్లో ఎవరో గుంజుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉపాధిహామీ చట్టాన్ని కాపాడుకోవాలి
ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఉపాధిహామీ పథకాన్ని కాపాడాలంటూ గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. 27 లేదా 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. వలసలు తగ్గించేందుకు, వెట్టి చాకిరీ నుంచి గ్రామీణ ప్రజలను విముక్తి చేయాలనే లక్ష్యంతో జాతీయ ఉపాధి హామీ చట్టం తెచ్చారని గుర్తు చేశారు. బీజేపీ ఉపాధి హామీ చట్టానికి ఉరి వేసిందని మండిపడ్డారు. చట్టం పేరులో నుంచి గాంధీ పేరు తీసేసి బీజేపీ గాంధీని మరోసారి హత్య చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పని దినాలను ఏటేటా తగ్గిస్తూ గ్రామీణ కూలీల హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు లాభం చేకూర్చేందుకు ఉపాధిహామీ చట్టాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హక్కును బిక్షలా కాకుండా హక్కుగా ఇచ్చే ఈ చట్టాన్ని రద్దు చేస్తే గ్రామాల్లో కూలీలకు పని ఉండదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని మంత్రి సీతక్క ప్రజలకు పిలుపునిచ్చారు.


