- కరీంనగర్ నియోజకవర్గానికి 4 వేల ఇందిరమ్మ ఇండ్లు
- కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు
కాకతీయ, కరీంనగర్ : పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని అన్నారు. చెర్లబుత్కూరు గ్రామంలో సోమవారం 194 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్‌ను ఆయన అందజేశారు. దసరా కానుకగా ముఖ్యమంత్రి ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా, త్వరలో అదనంగా మరో నాలుగు వేల ఇళ్లు కరీంనగర్ నియోజకవర్గానికి మంజూరు చేయనున్నారని రాజేందర్ రావు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి వచ్చే దసరా నాటికి గృహప్రవేశాలు జరిగేలా దగ్గరుండి పర్యవేక్షిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని, ప్రజలకు ద్రోహం చేసిందని ఆయన మండిపడ్డారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.


