టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు క్లీన్‌చిట్
నిర్దోషి గా తేల్చిన తెలంగాణ హై కోర్టు
కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల సంబరాలు
కాకతీయ, కరీంనగర్ : పదవ తరగతి పేపర్ లీక్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టు పూర్తిగా క్లీనుచిట్ ఇచ్చిన నేపథ్యంలో గురువారం రాత్రి కరీంనగర్ బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీజేపీ నాయకులు భారీగా చేరి టపాసులు పేల్చి, ఒకరికి ఒకరు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బండి సంజయ్‌ను రాజకీయంగా అణగదొక్కడానికి తప్పుడు కేసులు పెట్టిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై బండి సంజయ్ గళం విప్పడంతో, ఆవేదన భరించలేని నాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023లో పదోతరగతి పేపర్ లీక్ కేసులో అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించిందని తెలిపారు.అలాంటి కేసును హైకోర్టు కొట్టి వేయడం నాటి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పోరాటం చేసే నాయకులను అణచివేయాలనే బీఆర్‌ఎస్ ప్రయత్నానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పారని, ఆ పార్టీ ఇప్పుడు ప్రజల్లో పూర్తిగా నమ్మకం కోల్పోయిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో బీజేపీ మీడియా కన్వీనర్ కటకం లోకేష్, ఎండి ముజీబ్, రాపర్తి ప్రసాద్, కోలగని శ్రీనివాస్, వంగల పవన్, బండ రమణా రెడ్డి, లెక్కల వేణుగోపాల్, జోన్ అధ్యక్షులు బండారు గాయత్రి, అవదుర్తి శ్రీనివాస్, తణుకు సాయి, పార్వజ్, జాడి బాల్ రెడ్డి, నాగసముద్రం ప్రవీణ్, ఉప్పరపల్లి శ్రీనివాస్, సురేష్, సంపత్, రాజు, వరాల జ్యోతి, మాసం గణేష్, మాడిశెట్టి సంతోష్, సమీతో సహా అనేక మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



