ఆధ్యాత్మిక, మానవత విలువలపై తరగతులు
కాకతీయ, రామకృష్ణాపూర్: శ్రీ సత్య సాయి సేవ సమితి రామకృష్ణాపూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 28వ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత, మానవతా విలువల ప్రత్యేక శిక్షణ శిబిరాలు శుక్రవారం ముగిశాయి. రామకృష్ణాపూర్ సాయి ప్రశాంతి మందిరంలో ఐదు రోజులు పాటు ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో చిన్నారులు పాల్గొన్నారు. మానవత విలువలపై సమన్వయకర్తలు, సేవాదళ్ సభ్యులు చిన్నారులకు అవగాహన కల్పించారు. సేవా సమితి సభ్యులు నిర్వహించిన పలు కల్చరల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. మంచిర్యాల జిల్లా సత్యసాయి సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా సమన్వయకర్తలు, మంచిర్యాల్, రామకృష్ణాపూర్ సమితి సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.


