ఫ్లెక్సీ వివాదంతో కాంగ్రెస్‌లో వర్గపోరు
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి చొప్పదండి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఫొటో లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలిచాలా రాజేందర్ రావు వర్గీయులు పార్టీ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేతలను విస్మరించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో జిల్లా కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు బహిర్గతమైందని, ఐక్యత లోపిస్తే పార్టీకి నష్టం తప్పదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


