కాంగ్రెస్–బీజేపీ కౌన్సిలర్ల మధ్య బాహాబాహీ
ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
అజెండా పాస్ అంటూ ఛాంబర్‌కు వెళ్లిన ఛైర్పర్సన్ అనూష
చర్చించకుండానే అజెండా ఆమోదమా అంటూ బీజేపీ ఆగ్రహం
ఛైర్పర్సన్ కార్యాలయం ఎదుట బీజేపీ కౌన్సిలర్ల బైఠాయింపు
కాకతీయ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమావేశం సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని చివరకు తోపులాటకు దారితీసింది. సమావేశంలో అజెండా అంశాలపై చర్చ కొనసాగుతున్న సమయంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం పెరిగి పరస్పరం చొక్కాలు పట్టుకునే వరకు వెళ్లింది. దీంతో సమావేశంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో అజెండా పాస్ అయ్యిందని ప్రకటించిన మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. దీనిపై బీజేపీ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండా అంశాలను పూర్తిగా చర్చించకుండానే ఎలా పాస్ చేస్తారని ప్రశ్నిస్తూ బీజేపీ కౌన్సిలర్లు ఛైర్పర్సన్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సమావేశం ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


