బీఆర్ ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
విచక్షణా రహితంగా నిప్పు కర్రలతో పరస్పరం దాడి..!
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువు కొమ్ము తండాలో ఘటన
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు విచక్షణా రహితంగా నిప్పు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈసంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలంలోని చెరువు ముందు తండాలో జరిగింది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ప్రచ్చన్న యుద్ధం కొసాగుతుండగా.. సోమవారం రాత్రి గ్రామంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈఘటనలో రెండు పార్టీల నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. చెరువుకొమ్ము తండాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 20 మంది కార్యకర్తలు తమపై ముందు దాడికి పాల్పడినట్లుగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.


