కాకతీయ, లక్షెట్టిపేట : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించాలని సోమవారం సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ ప్రజావాణిలో తహసిల్దార్ దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం నూతన భవనం నిర్మించిందని ఈ ఆసుపత్రికి లక్షెట్టిపేట, దండేపల్లి,జన్నారం, మూడు మండలాల నుంచి ప్రజలు వైద్యం కొరకు నిత్యం వస్తుంటారని పేర్కొన్నారు.కానీ వైద్యులు, సిబ్బంది కొరత ఉండటం ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం అందించడంలో ఇబ్బందులు కలుగుతున్నాయని, నియోజకవర్గ ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్, జిల్లా డిఎంహెచ్ఓ, డిసిహెచ్, ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులను సిబ్బందిని నియమించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అడ్లూరి అక్షయ్ కుమార్,నాయకులు పాల్గొన్నారు.


