మృతుడి కుటుంబానికి సీఐటీయూ సాయం
కాకతీయ,శంకరపట్నం:మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇటీవల జరిగిన లారీ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి నిత్య కుటుంబానికి సిఐటియు కేశవపట్నం హమాలీ సంఘం ఆధ్వర్యంలో సహాయం అందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సంఘం ప్రతినిధులు తమ వంతు ఆర్థిక, వస్తు సహకారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి తక్షణ అవసరాల నిమిత్తం 1 క్వింటల్ 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. అదేవిధంగా నిత్య తల్లిదండ్రుల ముగ్గురు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోస్టాఫీస్ ఖాతా ద్వారా రూ.30 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఇలాంటి విషాద ఘటనల సమయంలో సమాజం ముందుకు వచ్చి బాధిత కుటుంబాలకు తోడ్పాటు అందించడం ఎంతో అవసరమని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేశవపట్నం హమాలీ సంఘం వారు పాల్గొన్నారు.


